కలం వెబ్ డెస్క్ : కర్ణాటక(Karnataka)లోని చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం(Bus Accident)పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. ప్రమాదంలో తమ సన్నిహితులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తారని తెలిపారు. గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సహాయం అందజేస్తారని చెప్పారు.
గురువారం తెల్లవారుజామున చిత్రదుర్గలో ఓ లారీ, ట్రావెల్స్ బస్సును వేగంగా వెనుక నుంచి ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బస్సు డీజిల్ ట్యాంకర్ పేలి బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. 17 మంది బస్సులోనే సజీవ దహనమయ్యారు. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకొని బయటపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి సమీప ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది.
Read Also: శాంతికుమారి కమిటీ ప్రపోజల్ రిజెక్ట్?
Follow Us On: Pinterest


