epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బంజారాహిల్స్‌లో డ్రంకెన్ డ్రైవ్.. క్షేత్రస్థాయిలో సీపీ ప‌ర్య‌వేక్ష‌ణ‌

కలం వెబ్ డెస్క్ : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌ (Banjara Hills)లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్(Drunk Driving) తనిఖీలను హైదరాబాద్(Hyderabad) పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (CP Sajjanar) బుధవారం అర్ధరాత్రి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. తనిఖీలు జరుగుతున్న విధానం, సిబ్బంది పనితీరును స్వయంగా పరిశీలించిన సీపీ, వారికి పలు సూచనలు చేశారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులతో మాట్లాడి మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, నష్టాలపై అవగాహన కల్పించారు.

డిసెంబర్ 31 రాత్రి వరకు నగరవ్యాప్తంగా ‘స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్’ నిర్వహిస్తున్నట్లు సీపీ (CP Sajjanar) తెలిపారు. ఏడు ప్లాటూన్ల అదనపు బలగాలతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సీపీ స్పష్టం చేశారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని రవాణా శాఖకు సిఫార్సు చేస్తామని తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని, నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సీపీ వీసీ సజ్జనార్ ప్రజలకు సూచించారు.

Read Also: సీఎం రేవంత్ ఢిల్లీ టూర్, రెండు రోజులు అక్కడే మకాం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>