కలం వెబ్ డెస్క్ : శంషాబాద్(Shamshabad)లోని రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్(RGIA)కు మరోసారి బాంబు బెదిరింపు(Bomb Threat) రావడం కలకలం రేపింది. గురువారం ఉదయం సౌదీ అరేబియా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఎయిర్‌బోర్న్ ప్లైనాస్ 325 విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ అందింది. విమానంలో ఐదు ఆర్‌డీఎక్స్ పరికరాలు అమర్చినట్లు, ఏ క్షణమైనా పేలుడు సంభవించే అవకాశం ఉందని గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ ద్వారా హెచ్చరించాడు. బెదిరింపు మెయిల్ అందిన వెంటనే ఎయిర్‌పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి దింపి, భద్రతా బలగాలతో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్‌తో విమానం అంతటా పరిశీలించారు.
ఈ ఘటనతో విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రయాణికుల భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. బెదిరింపు (Bomb Threat) మెయిల్ వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ నిపుణులు దర్యాప్తు చేపట్టాయి. ఇటీవలి కాలంలో వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులతో విమానాశ్రయాల్లో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: బంజారాహిల్స్‌లో డ్రంకెన్ డ్రైవ్.. క్షేత్రస్థాయిలో సీపీ పర్యవేక్షణ
Follow Us On: Youtube


