కలం, కరీంనగర్ : కరీంనగర్ (Karimnagar) జిల్లాలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలను గుర్తించి ఎస్‌ఐఆర్ ప్రక్రియలో (SIR Process) నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని జనసేన(Janasena) పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి (Bethi Mahender Reddy) కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించేందుకు సమగ్ర తనిఖీలు నిర్వహించి, అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల వద్ద విధులు నిర్వహించే బీఎల్‌ఓలకు తగిన భద్రత కల్పించాలని, ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
అలాగే కరీంనగర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన హిందూ అమ్మాయిల మిస్సింగ్ కేసులపై కూడా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని బేతి మహేందర్ రెడ్డి కోరారు. ఈ కేసులపై సమగ్ర దర్యాప్తు వేగవంతం చేసి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: తెలంగాణలో తీవ్రంగా కరెంట్ కోతలు: హరీశ్ రావు
Follow Us On: X(Twitter)

