బచ్చన్నపేట చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

కలం, జనగామ: జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసు (Bachannapet Burglary Case)ను పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.15.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రూ.15 వేల నగదు, మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు జనగామ ఇన్‌చార్జి ఏసీపీ బీమ్ శర్మ తెలిపారు.

ఈ నెల 8న ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లిన బాధిత కుటుంబం తిరిగి వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించి ఫిర్యాదు చేసింది. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు గురువారం కొన్నె క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు కంప విజయ్ అలియాస్ మొండితోపాటు ఇద్దరు మైనర్ నిందితులను అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>