epaper
Friday, January 16, 2026
spot_img
epaper

‘ఆరావళి’ మైనింగ్​ పై కేంద్రం కీలక నిర్ణయం

కలం, వెబ్​ డెస్క్​ : ఆరావళి పర్వత (Aravalli Hills) శ్రేణిలో మైనింగ్​ పై కేంద్ర ప్రభుత్వం (Central Government) వెనక్కి తగ్గింది. పర్వత ప్రాంతాల్లో మైనింగ్​ పై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మార్పుల మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆరావళి పర్వత ప్రాంతాల్లో ఇకపై ఎలాంటి మైనింగ్​ కార్యకలాపాలు జరగవని స్పష్టం చేసింది.

ఇప్పటికే దెబ్బతిన్న పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. మైనింగ్​ కారణంగా ఏర్పడిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. కాగా, ఆరావళి పర్వత శ్రేణులకు నష్టం కలిగేలా మైనింగ్​ మైనింగ్​ చేపట్టడంపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తం అయిన విషయం తెలిసిందే. ప్రజల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం Aravalli Hills మైనింగ్​ పై వెనక్కి తగ్గింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>