నిర్మల్‌లో దొంగల బీభత్సం.. పట్టపగలే అపార్ట్‌మెంట్‌లో చోరీ

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో పట్టపగలే తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక ఈదిగాం సమీపంలోని ఎస్వీ అపార్ట్మెంట్‌లో బుధవారం దొంగతనం (Apartment Theft) జరిగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు 101 వ ఫ్లాట్ తాళం ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న సుమారు 25 తులాల వెండిని అపహరించారు.

అనంతరం అదే అపార్ట్మెంట్‌లోని 201వ ఫ్లాట్ తాళం కూడా పగులగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే తలుపు తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాచ్‌మెన్‌కు అనుమానం రావడంతో పరిశీలించగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అపార్ట్మెంట్ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సీఐ సమ్మయ్య ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దుండగుల కోసం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>