epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నకిలీ మద్యం కేసు.. నిందితుల జాబితాలో మరో ఏడుగురు

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో లభ్యమైన నకిలీ మద్యం కేసు(Illegal Liquor Case) కీలక మలుపు తీసుకుంది. ఈ కేసు నిందితుల జాబితాలో రోజురోజుకు పెరుగుతోంది. ఈ జాబితాలో తాజాగా మరో ఏడుగురు పేర్లను చేర్చారు ఎక్సైజ్ అధికారులు. ఈ మేరకు తంబళ్లపల్లె కోర్టులో మెమో దాఖలు చేశారు. టీడీపీ సస్పెండ్ అయిన జయచంద్రరెడ్డిని ఈ కేసులో ఏ17గా చేర్చారు. ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డిని ఏ18గా పేర్కొన్నారు. వీరితో పాటు బాలాజీ, అన్బురాసు, రవి, అష్రఫ్‌, సుదర్శన్‌లపై కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం కేసులో ఇప్పటికే 14 మందిపై ఎక్సైజ్‌ అధికారులు నిందితుల జాబితాలో పెట్టారు. తాజాగా ఏడుగురిని చేర్చడంతో నిందితుల సంఖ్య 21 చేరింది. ప్రధాన నిందితుల కోసం బెంగళూరులో నిఘా పెట్టి గాలింపులు చేస్తున్నారు అధికారులు.

Read Also: జగన్ నర్సీపట్నం పర్యటనపై ప్రత్తిపాటి పంచ్‌లు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>