దగ్ధమైన పండ్ల దుకాణం.. బాధితులకు ఎమ్మెల్యే భరోసా

కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) పట్టణంలోని పాత బస్టాండ్‌ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో గోకం రాధమ్మకు చెందిన పండ్ల దుకాణం దగ్ధమై భారీ నష్టం వాటిల్లింది. ప్రమాదం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Tudi Megha Reddy) మంగళవారం ఘటనాస్థలికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రమాదంలో సుమారు రూ.3.5 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు ఎమ్మెల్యేకు వివరించారు.

పండ్ల వ్యాపారంపైనే ఆధారపడి జీవిస్తున్న గోకం రాధమ్మ కుటుంబానికి జరిగిన నష్టం పట్ల ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైన సహాయాన్ని అందించేందుకు అధికారులతో మాట్లాడతామని తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మధు మాట్లాడుతూ.. ప్రమాదంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఎమ్మెల్యేతో కలిసి ఘటనాస్థలిని సందర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>