కలం, వెబ్‌డెస్క్: అంతరిక్ష రంగంలో ఆధిపత్యం నిలుపుకునేందుకు రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రునిపై అణు విద్యుత్ కేంద్రం (Nuclear Power Station) నిర్మించనుంది. ఈ మేరకు రష్యాకు (Russia) చెందిన రోసోకాస్మోస్ సంస్థ వెల్లడించింది. అయితే, అది అణువిద్యుత్ కేంద్రమా ? కాదా అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. కానీ, స్పేస్ సైంటిస్ట్‌లు మాత్రం కచ్చితంగా అది అణు విద్యుత్ కేంద్రమే అంటున్నారు. ఈ కేంద్రాన్ని నిర్మించే బాధ్యతను లావోష్కిన్ అసోసియేషన్ ఏరోస్పేస్ కంపెనీకి రష్యా అప్పగించింది. అన్నీ సజావుగా జరిగితే 2036లోగా ఇది అందుబాటులోకి రానుంది. ఈ ప్లాంట్ లూనార్ ప్రోగ్రామ్‌కు.. ముఖ్యంగా చైనా–రష్యా సంయుక్త ప్రాజెక్ట్ అయిన లూనార్ రీసెర్చ్ స్టేషన్‌కు (Lunar Research Center) అవసరమైన విద్యుత్ అందించనుంది. ఈ స్పేస్ స్టేషన్ రోవర్స్, అబ్జర్వేటరీ, మౌలిక సదుపాయాలకు ఉపయోగపడనుంది.
ఒకప్పుడు అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాలు అనగానే ఠక్కున రష్యా గుర్తొచ్చేది. చంద్రునిపై అడుగుపెట్టిన వ్యోమగామి యూరీ గగారిన్తోపాటు ఆ దేశానికి గర్వకారణమైన లూనార్ ప్రయోగాలు ఈ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అయితే, కొన్నేళ్లుగా ఈ పరిస్థితి మారిపోయింది. అంతరిక్ష రంగంలో అమెరికా ఆధిపత్యం మొదలైంది. ముఖ్యంగా ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ఎక్స్’ వచ్చాక అంతరిక్షం రంగంలో రష్యా ఆధిపత్యానికి గండి పడడం మొదలైంది. రెండేళ్ల కిందట రష్యా ప్రయోగించిన మానవ రహిత లూనా–25 మిషన్ చంద్రునిపై సురక్షితంగా దిగడంలో విఫలమైంది. అదే సమయంలో ఎలాన్ మస్క్ స్పేస్ వెహికల్స్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. మరోవైపు చైనా సైతం అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకొస్తోంది. ఈ తరుణంలో అంతరిక్ష కేంద్రంలో తమ ఆధిపత్యం కొనసాగడానికి చంద్రునిపై అణు విద్యుత్ కేంద్రం (Nuclear Power Station) నిర్మించాలని రష్యా భావిస్తోంది.
Read Also: అక్కడ కోడళ్లకు ఫోన్లు నిషేధం.. కారణం తెలిస్తే అవాక్కవుతారు
Follow Us On : WhatsApp


