epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అక్కడ కోడళ్లకు ఫోన్లు నిషేధం.. కారణం తెలిస్తే అవాక్కవుతారు

కలం, వెబ్​ డెస్క్​ : ప్రపంచం టెక్నాలజీ వినియోగంలో ఎన్నో ఘనతలు సాధించింది. అయినా కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు, ఆచారాలు ఇప్పటికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. రాజస్థాన్​ లో జాలోర్​ జిల్లా గాజీపూర్​ గ్రామంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 15 గ్రామాల్లో చౌదరి సమాజానికి చెందిన కోడళ్లు, యువతులు సెల్​ ఫోన్​ ల వాడకంపై కఠిన ఆంక్షలు (Smart Phone Ban) విధించారు. కెమెరా ఉన్న ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. జనవరి 26 నుంచి స్మార్ట్​ ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ, కేవలం కాల్స్​ చేయడానికి మాత్రమే ఉపయోగించే కీప్యాడ్​ ఫోన్​ లను మాత్రమే అనుమతించాలని తీర్మానించారు.

అలాగే, కోడళ్లు.. యువతులు పెళ్లిల్లు, సామాజిక కార్యక్రమాలు, బహిరంగ వేడుకలు, బయటకు వెళ్లేటప్పుడు కూడా సెల్​ ఫోన్లు తీసుకెళ్లడకూడదంటూ ఆంక్షలు జారీ చేశారు. స్మార్ట్​ ఫోన్ల వినియోగం పూర్తిగా నిషేదం కాగా, కీ ప్యాడ్​ ఫోన్​ లతో కేవలం కాల్స్​ చేయడానికి మాత్రమే అనుమతి ఉంది. అయితే, విద్య కోసం మొబైల్​ అవసరం ఉన్న పాఠశాల విద్యార్థులకు కొంత సడలింపు ఇచ్చారు. వారు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఫోన్​ వాడొచ్చని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తీసుకువెళ్లకూడదని పంచాయతీ స్పష్టం చేసింది.

మహిళలు మెబైల్​ ఫోన్లను ఎక్కువగా వినియోగించడం వల్ల వారి కళ్లపై ప్రతి కూల ప్రభావం పడుతోందని గ్రామపెద్ద చెబుతన్నారు. అలాగే కొందరు మహిళలు ఇంటి పనులు సులభంగా పూర్తిచేసుకోవాడానికి తమ పిల్లలకు పోన్లు ఇస్తున్నారని, ఇది మంచిది కాదని అభిప్రాయపడ్డారు. మొబైల్​ వినియోగం తగ్గిస్తే మంచి ఫలితాలు వస్తాయని పంచాయతీ పెద్దలు అంటున్నారు. కాగా, Smart Phone Ban నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. ఇది ఆడవాళ్ల స్వేచ్ఛ, హక్కులను హరించే విధంగా ఉన్నాయని తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Read Also: ముంబైని కాపాడడానికే కలిశాం.. ఠాక్రే సోదరులు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>