కలం, వెబ్ డెస్క్: రాబోయే గోదావరి పుష్కరాల లోపే పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)ను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) వ్యాఖ్యానించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటించారు. ధవళేశ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 117 కొత్తగేట్ల ఏర్పాటు పనుల్ని ప్రారంభించారు. బ్యారేజీ గేట్ నం.1 వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు.
అనంతరం పిచ్చుకులంకలో కొత్తపేట నియోజకవర్గం రైతులతో ముఖాముఖి అయ్యారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. కొత్త గేట్లతో ధవళేశ్వరం బ్యారేజీని కాపాడే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. రూ. 153 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల ఆధునీకరణ పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
అప్పుడు మరమ్మతులు చేసింది టీడీపీ ప్రభుత్వమే..
రైతులకు భద్రత, భరోసా ఇవ్వడంలో ఎల్లప్పుడూ ముందుంటామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) భరోసా కల్పించారు. 2014లో 64 గేట్లకు మరమ్మతులు చేసింది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. గోదావరి డెల్టా ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రూ.13 కోట్లతో లైడార్ సర్వే నిర్వహించామని.. త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ధవళేశ్వరం బ్యారేజీకి (Dhavaleshwaram Barrage) రెండేళ్లలో గేట్ల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. పుష్కరాల కంటే ముందే బ్యారేజీకి కొత్త గేట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గోదావరి జిల్లాల్లో కోకో సాగుతో రైతులకు లాభాలు వస్తున్నాయని సీఎం చెప్పుకొచ్చారు కోకో సాగు ప్రోత్సాహానికి కొవ్వూరులో కోకో క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు.
మహా ప్రమాదకరమైంది గొడ్డలి పార్టీ..
గంజాయి, బ్లేడ్ బ్యాచ్ కంటే మహా ప్రమాదకరమైంది గొడ్డలి పార్టీ అంటూ వైసీపీ (YSRCP)పై సీఎం తీవ్ర విమర్శలు చేశారు. గొడ్డలి పార్టీ నాయకులు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీటి పంపిణీ చేస్తామని చెప్పారు. పిచ్చుకలలంక, బొజ్జర్లలంకను టూరిజం కేంద్రంగా మార్చుతామన్నారు. గోదావరి ఏటిగట్లను బలోపేతం చేస్తామని తెలిపారు. అమలాపురం సమీపంలో 216 రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోనసీమకు రైల్వే లైన్ తీసుకొచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం గేట్లను మార్చడం కాదు కదా.. కొట్టుకుపోయిన గేట్లను సైతం పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
Read Also: పవన్ ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం
Follow Us On: X(Twitter)

