వనభోజనాల్లో విషాదం.. లక్నవరం చెరువులో యువకుడు గల్లంతు

కలం, వరంగల్ బ్యూరో: లక్నవరం చెరువు (Laknavaram Lake) లో ఈతకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ములుగు మండలం అంకన్నగూడెం గ్రామస్తులు కుటుంబ సమేతంగా సమీపంలోని అటవీ ప్రాంతానికి వనభోజనాలకు వెళ్లారు. దగ్గరలో లక్నవరం చెరువు ఉండడంతో ముగ్గురు యువకులు సరదాగా ఈత కోసం చెరువులోకి దిగారు.

ఈ సమయంలో గ్రామానికి చెందిన అల్లెం సమ్మక్క-ముత్తయ్య దంపతుల కుమారుడు అల్లెం రాజేశ్ (20) నీటిలో గల్లంతయ్యాడు. పక్కన ఉన్న ఇద్దరు స్నేహితులు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు చెరువులో వెతికారు. కానీ ఎంత వెతికినా రాజేశ్ ఆచూకీ దొరకలేదని వారు తెలిపారు.

Read Also: భర్తలు లేకుండానే భార్యలు సోలో ట్రిప్స్.. అసలు విషయమిదే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>