‘కొరియన్ కనకరాజు’ టీజర్ అప్డేట్.. రంగంలోకి ప్రభాస్

కలం, సినిమా : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటిస్తున్న ఇండో-కొరియన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు'(Korean Kanakaraju) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుంచి ‘కిమ్‌చికారం’ టీజర్ నేడు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది. ఈ టీజర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

“కొరియన్ కనకరాజు ప్రపంచానికి తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఇండో-కొరియన్ మ్యాడ్‌నెస్‌కు సిద్ధంగా ఉండండి” అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా (Korean Kanakaraju) 2026 ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ చేతుల మీదుగా టీజర్ విడుదల కానుండటంతో అభిమానులలో  మరింత ఆసక్తి నెలకొంది.

Read Also: అమెరికా కాన్సులేట్‌పై ఆర్జీవీ ప్రశంసలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>