నిహారిక ఎన్ఎం(Niharika NM).. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కంటెంట్ క్రియేటర్‌గా భారీ ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ‘మిత్రమండలి’ మూవీతో అమ్మడు తెలుగు తమ్ముళ్ల ముందుకు రానుంది. అయితే ఇదివరకే నిహారిక.. తమిళంలో ‘పెరుసు’ అనే సినిమాలో నటించింది. సినిమాలతో పాటు మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తుంటుంది నిహారిక. అయితే తాజాగా ఆమె ఒక్కో సినిమాను ప్రమోట్ చేయడానికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఛార్జ్ చేస్తారు? అన్న అంశాన్ని ఒకరు అడగ్గా.. నిహారిక షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను అంతకన్నా ఎక్కువే ఛార్జ్ చేస్తానని చెప్పింది. అందులో తప్పేమీ లేదని కూడా వివరించింది.
‘‘కొంతమంది హీరోలు చేసిన సినిమాల ట్రైలర్ల కన్నా నా వీడియోలకు చాలా ఎక్కువ వ్యూస్ ఎక్కువ వస్తుంటాయి. అలాంటప్పుడు అంత ఛార్జ్ చేయడం తప్పేంకాదు. నేను చిన్నవయసులోనే కంటెంట్ క్రియేటర్‌గా మారా. సరదాగా స్టార్ట్ చేసిన కంటెంట్ క్రియేషన్ నుంచి రాబడి బాగానే వచ్చింది. కానీ వచ్చే మొత్తంలో ఎక్కువ ట్యాక్స్‌లకే పోతుంది’’ అని Niharika NM చెప్పింది.
Read Also: బాలీవుడ్ స్నేహాలు పార్టీలకే పరిమితం.. కరణ్ అంత మాట అన్నాడేంటి..!

