కలం, హనుమకొండ : హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా (Hanumakonda DMHO) ఏ.అప్పయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల సాధారణ బదిలీలలో భాగంగా ములుగు ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ గా జాయిన్ అయిన ఆయనను హనుమకొండ డిఎంహెచ్వో గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు విధుల్లో చేరిన అప్పయ్య జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారు జిల్లా ప్రజలకు మెరుగైనవైద్య సేవలు అందించాలని సూచించారు.
Read Also: డీఎస్పీ భీమ్ రెడ్డి కేసులో టాలీవుడ్ హీరో!
Follow Us On : WhatsApp

