డీఎస్పీ భీమ్ రెడ్డి కేసులో టాలీవుడ్ హీరో!

క‌లం, వెబ్ డెస్క్‌: అక్ర‌మాస్తుల కేసులో ఇటీవ‌ల అరెస్ట్ అయిన డీఎస్పీ భీమ్ రెడ్డి (DSP Bheem Reddy) కేసులో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. భీమ్ రెడ్డి ఇంట్లో సోదాల్లో భాగంగా ఏసీబీ (ACB) అధికారులు ఆయ‌న డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలో ఆయ‌న ఓ ప్ర‌ముఖ టాలీవుడ్ హీరోకి రూ.3 కోట్లు అప్పు ఇచ్చిన‌ట్లు రాసుకున్న‌ట్లు గుర్తించారు. ఈ హీరోతో పాటు మ‌రికొంద‌రు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల పేర్లు కూడా డైరీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ముందుగా ఈ హీరోకు నోటీసులు ఇచ్చి విచార‌ణ చేయాల‌ని అధికారులు భావిస్తున్నార‌ని స‌మాచారం. అలాగే భీమ్ రెడ్డి త‌న డైరీలో ఆస్తులు, బినామీల పేర్లు కూడా రాసుకున్నాడ‌ని ఏసీబీ వెల్ల‌డించింది. బినామీల‌కు కూడా నోటీసులు అందించి విచారిస్తామ‌ని అధికారులు వెల్ల‌డించారు. అధికారుల విచార‌ణ‌లో భీమ్‌రెడ్డికి రూ.300 కోట్ల అక్ర‌మాస్తులు ఉన్న‌ట్లు గుర్తించారు. డీఎస్పీ ద‌గ్గ‌ర అప్పు తీసుకున్న హీరో ఎవ‌రై ఉంటారా అని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>