మహాత్మా గాంధీ వర్సిటీలో క్రీడల బోర్డ్ మీటింగ్

కలం, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో (Mahatma Gandhi University) యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన స్పోర్ట్స్ బోర్డు మీటింగ్ నిర్వహించారు. క్రీడల పురోగతి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను 26 క్రీడా అంశాలకు సంబంధించి స్పోర్ట్స్ బోర్డు బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించారు.

దీనితో పాటు విశ్వవిద్యాలయంలో క్రీడల అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి క్రీడా సౌకర్యాల కల్పన, రాబోయే ఇంటర్ యూనివర్సిటీ క్రీడా పోటీల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు.

క్రీడల్లోనూ ప్రతిభ చాటాలి..

వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా, క్రీడల్లోనూ ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. అవసరమైన అన్ని రకాల వసతులు, సహాయ సహకారాలను అందించేందుకు ఎల్లప్పుడూ విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉంటుందన్నారు.

ఈ సమావేశంలో వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రెటరీ డాక్టర్ హరీష్ కుమార్, డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ రాజేష్ కుమార్, స్పోర్ట్స్ బోర్డ్ కో–ఆర్డినేటర్ శివ శంకర్, ప్రొఫెసర్ వసంత, డాక్టర్ మిర్యాల రమేష్ కుమార్, డాక్టర్ కె.అరుణ ప్రియ, సీహెచ్.సుధాకర్ రెడ్డి, డాక్టర్ రవి నాయక్, వెంకటేశ్వర్లు, డాక్టర్ సంజయ్ సాహు, జానకీరామ్, ఫ్రాన్సిస్ రవీందర్, స్వప్న, డాక్టర్ రమావత్ మురళీ, డాక్టర్ వై.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>