కలం, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆపార్టే గెలుస్తుందని, అదే నా స్పెషాలిటీ అని దానం అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎంఐఎంతో కలిపి కాంగ్రెస్ 300 డివిజన్‌లలో గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సిటీలో ఇంత డెవలప్‌మెంట్ చేసిన కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదని ఎమ్మెల్యే దానం నాగేందర్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ (BRS) తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషిన్ వేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలలో అయిదుగురిపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేయడంతో ఫిరాయింపుల వ్యవహారం ఆసక్తిగా మారింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు మీడియా ముందుకొచ్చి వివరణలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి దానం నాగేందర్(Danam Nagender) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also: కొండా సురేఖకు సమన్లు జారీ చేసిన నాంపల్లి కోర్టు
Follow Us On: Instagram


