కలం, వెబ్ డెస్క్ : నాకు తెలంగాణ రాష్ట్రమే మొదటి ప్రాధాన్యత.. తరువాత పార్టీ.. ఆ తరువాతే వ్యక్తిగత విషయాలు అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో ఈటల మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం కంటే ముందు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు నిర్మించారని గుర్తు చేశారు. జల యజ్ఙంలో భాగంగానే తమ్మిడిహట్టి ప్రాజెక్ట్ రూపకల్పన చేశారన్నారు. కాళేశ్వరం నీళ్లు చేవెళ్ల వరకు రావాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచించిందని తెలిపారు. తాను ఎవరో పలికిస్తే మాట్లాడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.
తన మాటలు వ్యవసాయం గురించి అవగాహన ఉన్నవారికి అర్థమవుతాయని ఈటల రాజేందర్ వెల్లడించారు. ఎల్ నినో హెచ్చరికలు.. తెలంగాణలో వర్షాభావ పరిస్థితలు ఉన్నాయన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం నిపుణులు, ఇంజినీర్స్ తో ఒక మీటింగ్ పెట్టి లక్ష్మీబరాజ్, అన్నారం, సుందిళ్ల బరాజ్ లో నీటి ఎత్తిపోతలపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు అని ఈటల నిలదీశారు.
Read Also: సీఎం సభకు ముందు జగన్ ఫ్లెక్సీ కలకలం.. ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్
Follow Us On: X(Twitter)

