షూ ఫ్యాక్ట‌రీలో ఘోర అగ్ని ప్ర‌మాదం.. 28 మంది మృతి!

క‌లం, వెబ్ డెస్క్‌: చైనా (China)లోని ఓ షూ ఫ్యాక్ట‌రీ (Shoe Factory)లో ఘోర అగ్ని ప్ర‌మాదం (Fire Accident) జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 28 మంది అక్క‌డిక‌క్క‌డే స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. జిన్‌జియాంగ్‌లో ఈ విషాద‌క‌ర‌ ఘ‌ట‌న చోటు చేసుకుంది. షూ ఫ్యాక్ట‌రీలో మంట‌లు చెల‌రేగి ఒక్క‌సారిగా అంత‌టా వ్యాపించాయి. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే అగ్ని మాప‌క సిబ్బంది, రెస్క్యూ టీమ్స్‌ హుటాహుటిన అక్క‌డికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. 35 ఫైర్ ఇంజిన్ల‌తో మంట‌లను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 183 మందిని కాపాడిన‌ట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. పూర్తి స్థాయిలో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ ప్ర‌మాదంలో 28 మంది మ‌ర‌ణించిన‌ట్లు చెప్తున్నా మృతుల సంఖ్య మ‌రింత పెరుగుతుంద‌ని ఆందోళ‌నలు వ్య‌క్తం అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>