Mobile Popup Ad
Mobile Popup Ad

జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసిన టీఎన్జీవోలు

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లా విద్యాశాఖ అధికారి నరేడ్ల ప్రశాంత్ రెడ్డిని టీఎన్జీవోల (TNGOs) సంఘం ప్రతినిధులు గురువారం కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి నరేడ్ల ప్రశాంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం టీఎన్జీవోల సంఘం నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగేం లక్ష్మణ్ రావు, టీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, టీఎన్జీవోల కేంద్ర సంఘం నాయకులు, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, పట్టణ కార్యదర్శి వెలిచాల సుమంత్ రావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు తోట రామస్వామి, జిల్లా కార్యదర్శి శంకర్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం పట్టణ అధ్యక్షులు మర్రి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>