Mobile Popup Ad
Mobile Popup Ad

స్ట్రామ్ వాటర్ డ్రైన్ పరిశీలన.. డిప్యూటీ మేయర్ ఆదేశాలు

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) పట్టణంలోని ఎస్బీఎస్ (SBS) ఫంక్షన్ హాల్ నుండి కలెక్టరేట్ వరకు ఉన్న ఓపెన్ స్ట్రామ్ వాటర్ డ్రైన్ (Open Storm Water Drain) ను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Deputy Mayor Sunil Rao) మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. ఇండ్ల మధ్యలో ఉన్న ఈ అతిపెద్ద ఓపెన్ డ్రైన్ వల్ల ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో ఈ ప్రాంతం అంతా వరద కాలువల వల్ల జలమయం అయ్యేదని ఆయన గుర్తుచేశారు. దీనిని నివారించడానికి సుమారు 22 సంవత్సరాల క్రితం ఈ స్ట్రామ్ వాటర్ డ్రైన్‌ను నిర్మించినట్లు తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇళ్లలోకి నీళ్లు మురుగు రాకుండా, చుట్టుపక్కల ప్రాంతాలు ముంపుకు గురికాకుండా ఈ కాలువ కాపాడుతూ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే, నిర్మాణం జరిగి 22 ఏళ్లు కావడంతో ఇది చాలా చోట్ల కూలిపోయి శిథిలావస్థకు చేరుకుందని వివరించారు. కరీంనగర్ (Karimnagar) నగరం నుండి వచ్చే వరద నీటిలో 20 శాతానికి పైగా నీళ్లు ఈ కాలువ గుండానే వెళ్తాయని ఆయన తెలిపారు.

గతంలో ఈ కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటనలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. కరీంనగర్ నగరంలో ఉన్న నాలుగు మురికి కాల్వలలో ఇది ఒక ప్రధాన మురికి కాలువ. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా కాలువ పాడైపోయిన చోట పునర్నిర్మాణం చేయడంతో పాటు, అవసరమైన చోట రిటైనింగ్ వాల్స్ నిర్మించి, డ్రైనేజీ మొత్తం కవర్ అయ్యేలా పైభాగంలో స్లాబ్ వేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

దీనివల్ల కాలువ నుండి వచ్చే దుర్వాసన అరికట్టడమే కాకుండా, వర్షాకాలంలో ఎలాంటి ప్రాణాపాయం, ప్రమాదాలు జరగకుండా వరద నీటి ప్రవాహానికి ఇది అత్యంత కీలకమైనది కావడంతో, దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్మిస్తున్నట్లు సునీల్ రావు వెల్లడించారు. ఈ నిర్మాణ పనులకు సంబంధించి తక్షణమే అంచనాలు రూపొందించి, పనులు వేగవంతం చేయాలని మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు. రాబోయే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు గట్టు స్వామి, కాలిద్ మరియు కాలనీవాసులు ఆంజనేయులు, వామన్ రావు, శంకరయ్య, సత్యం, సురేందర్, లక్ష్మణమూర్తి, నారాయణ గౌడ్, కనకయ్య, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు.

Read Also: రష్మిక మందన్న భారీ సాహసం.. ఇండియన్ సినీ చరిత్రలోనే!

Read Also: డిజిటల్ వారసులు 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>