Mobile Popup Ad
Mobile Popup Ad

యువకుడి దారుణ హత్య.. ​ఆర్మీకి ఎంపికైనా దక్కని ప్రాణం!

​కలం, జోగులాంబ గద్వాల: జిల్లాలో (Jogulamba Gadwal) దారుణం జరిగింది. పొలం వద్ద నిద్రిస్తున్న ఓ యువకుడిని ఘోరంగా హత్య చేసిన సంఘటన మల్దకల్ మండలం ఉలిగేపల్లిలో గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉలిగేపల్లి (Uligapally) గ్రామానికి చెందిన బోయ గోవిందమ్మ గోవిందుల పెద్ద కుమారుడైన బోయ మహేష్(24) ప్రతిరోజూ రాత్రి వేళల్లో గ్రామ శివారులో ఉన్న పొలం వద్ద ఉన్న గుడిసెలోనే నిద్రించేవాడు. ఈ‌‌ క్రమంలో బుధవారం రాత్రి పొలానికి వెళ్లాడు. అయితే, గురువారం తెల్లవారుజామున కుటుంబ సభ్యుల్లో ఒకరు పొలం వద్దకు వెళ్లి చూసేసరికి, మహేష్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

​రక్తపు మడుగులో ఉన్న మహేష్ ను కుటుంబ సభ్యులు గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే మహేష్ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాని కుటుంబ సభ్యులకు అప్పగించారు‌. మహేష్ మృతికి ప్రేమ వ్యవహారమే అయిండొచ్చు అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు..

విషయం తెలుసుకున్న గద్వాల సీఐ టి.శ్రీను, మల్దకల్ ఎస్ఐ శ్రీహరి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. “హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. మృతుడి సెల్‌ఫోన్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నాం. నిందితులను త్వరలోనే గుర్తించి, అరెస్ట్ చేస్తాం అని గద్వాల సీఐ టి.శ్రీను తెలిపారు.

​ఆర్మీకి ఎంపికైనా దక్కని ప్రాణం..

మృతుడు బోయ మహేష్ ఇటీవలనే ఇండియన్ ఆర్మీకి ఎంపికయ్యాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తెలిపారు. అయితే ఇటీవల జరిగిన ఒక గాయం కారణంగా ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ, కుటుంబానికి ఆసరాగా వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేని తమ కుమారుడిని ఇంత దారుణంగా పొట్టనబెట్టుకున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>