Mobile Popup Ad
Mobile Popup Ad

వేములవాడ సమీపంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

కలం, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada) సమీపంలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాంపల్లి వద్ద గురువారం జరిగిన ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న వారు బీహార్‌ రాష్ట్రానికి చెందిన కూలీలుగా సమాచారం అందుతోంది.

ఈ ఘటనలో 23 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>