Mobile Popup Ad
Mobile Popup Ad

భార్య కోసం వృద్ధుడి బతుకు పోరాటం.. ఓ టాక్సీ డ్రైవర్ కన్నీటి కథ!

కలం, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక హృదయ విదారక వీడియో ద్వారా కోల్‌కతాకు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు (Kolkata Cab Driver) కథ వెలుగులోకి వచ్చింది. వృద్ధాప్య భారంతో శరీరం సహకరించకపోయినా 67 ఏళ్ల భార్యను పోషించుకోవడానికి రవీంద్రనాథ్ సర్కార్ అనే వృద్ధుడి స్టీరింగ్ పట్టుకున్నాడు. ప్రతిరోజూ అద్దె టాక్సీ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. దాదాపు 52 ఏళ్లుగా టాక్సీ నడుపుతున్నాడు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు 16 గంటలపాటు కష్టపడి డ్రైవింగ్ చేస్తున్నాడు. సంపాదన ఉన్నా లేకపోయినా యజమానికి టాక్సీ అద్దె చెల్లిస్తున్నాడు. పిల్లలు లేని ఈ వృద్ధ దంపతులు మందులు కొనడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.

ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్న రవీంద్రనాథ్ సర్కార్, గుండె జబ్బు ఉన్న తన భార్య కోసం ఈ వయసులోనూ కష్టపడుతుండటం అందరినీ కదిలిస్తోంది. ప్రయాణికులు ఎంత ఇస్తే అంత తీసుకోవడం ఆయన (Kolkata Cab Driver) ప్రత్యేకత. కోల్‌కతాలోని రైల్వే ట్రాక్‌ల సమీపంలో ఒక చిన్న రేకుల ఇల్లు వీరికి ఆశ్రయం ఇస్తోంది. వర్షాకాలంలో ఆ ఇల్లు పూర్తిగా కురుస్తుంది. దాన్ని బాగు చేయించుకునే స్తోమత కూడా వారికి లేదు. ఈ వృద్ధ దంపతులకు తోచిన సాయం చేయాలని పలువురు నెటిజన్లను కోరుతున్నారు.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వేలాది మందిని కదిలించింది. సమాజంలో గౌరవంగా బతికిన వృద్ధులు తమ చివరి రోజుల్లో మనుగడ కోసం ఇంతలా పోరాడటం బాధాకరమన్నారు. వీరికి సహాయం చేయడం కనీస బాధ్యత అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వయసులోనూ అడుక్కోకుండా కష్టపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని ఆదుకోవడంలో వ్యవస్థ ఎంతలా విఫలమైందో ఈ ఘటనే నిదర్శనమంటున్నారు.

Read Also: రష్మిక మందన్న భారీ సాహసం.. ఇండియన్ సినీ చరిత్రలోనే!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>