కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి (Yellareddypalli) లో చిరుత సంచారం ఆందోళన రేపుతోంది. శ్రావణ్ అనే రైతుకు చెందిన కోళ్ల ఫారం వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో కోళ్ల ఫారం బయట ఆవు కట్టేసి ఉండటంతో చిరుత వచ్చి కాసేపు కాపు కాసింది. అక్కడే ఉన్న కుక్కలు అరవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.
సీసీ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డు అయ్యాయి. కుక్కలు లేకపోతే ఆవు దక్కేది కాదని రైతు అంటున్నారు. మరో వైపు గ్రామస్తులు సైతం చిరుత సంచారం విషయమై ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు సిబ్బంది అక్కడికి వెళ్లి చిరుత పాదముద్రలు సేకరించి జాగ్రత్తలు చెబుతున్నారు.

