Mobile Popup Ad
Mobile Popup Ad

పిల్లలు బలహీనంగా ఉన్నారా..? రోజువారీ ఆహారంలో ఈ మార్పులు చేయండి

కలం, వెబ్ డెస్క్: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల శారీరక, మానసిన ఎదుగుదలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంత మంది పిల్లలు వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేకుండా చాలా బలహీనంగా ఉంటారు. మరికొంతమంది పిల్లలు ఎప్పుడూ నీరసంగా, అలసటగా కనిపిస్తారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. అయితే దీని గురించి ఆందోళన అవసరం లేదని, ఎదుగుతున్న వయసులో పిల్లల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు సరిగ్గా అందనపుడు పిల్లలు బలహీనంగా మారుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అయితే కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలను పిల్లల రోజువారీ డైట్ లో చేర్చడం ద్వారా పిల్లలను చురుగ్గా, ధృడంగా మార్చవచ్చని చెబుతున్నారు. ఆ ఆహార పదార్థాలు (Foods for Kids Growth) ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లల బలహీనతను తగ్గించే పోషకాహారాలు

నట్స్: పిల్లల బలానికి నట్స్ అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు. బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు, ఖర్జూరం, కిస్‌మిస్‌లు వంటివి పిల్లల బలహీనతను తగ్గించి వారిని ధృడంగా మార్చడానికి ఉపయోగపడతాయి. నట్స్ తినడం వలన రక్తహీనత తగ్గి కండరాలు వృద్ధిచెందుతాయి.

అరటిపండు: బలహీనంగా ఉన్న పిల్లలకు ప్రతిరోజూ ఒక అరటిపండు ఇవ్వడం వలన చాలా వేగంగా ఫలితం ఉంటుంది. అరటిపండులో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోస్ వంటి సహజ చక్కెరలు నీరసంగా ఉన్న పిల్లలకు సహజ శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా రాత్రి పూట గాఢ నిద్ర పట్టేందుకు ఈ పండు సహాయపడుతుంది. దీంతో పిల్లల్లో చురుకుదనం పెరుగుతుంది.

నెయ్యి: పిల్లల భోజనంలో నెయ్యిని చేర్చాలి. నెయ్యితో పిల్లల శరీరానికి కావాల్సిన మంచి కొవ్వులు లభిస్తాయి. బలహీనంగా ఉన్న పిల్లల బరువు పెరుగుదలకు నెయ్యి సహకరిస్తుంది.

పాల ఉత్పత్తులు: పిల్లలకు రెగ్యులర్ గా పాల ఉత్పత్తులు ఇవ్వాలి. ముఖ్యంగా పాలలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి బలహీనంగా ఉన్న పిల్లల ఎముకలను ధృడంగా మార్చడానికి, ఎత్తు పెరగడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా పెరుగు, జున్ను, చీజ్ ఇవ్వడం వలన ఎ, బి, ఇ, డి విటమిన్లు, ప్రోటీన్లు అంది పిల్లలు బలంగా పెరుగుతారు.

తాజా ఆకుకూరలు, కూరగాయలు: బలహీనంగా ఉన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీనివల్ల వారు తరచూ జబ్బు పడుతుంటారు. అలాంటి పిల్లలను లోపలి నుండి బలంగా మార్చడానికి, వారి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందించడానికి తాజా ఆకుకూరలు, కూరగాయలు ఎంతగానో తోడ్పడతాయని చెబుతున్నారు నిపుణులు.

కోడిగుడ్లు: పిల్లలను ధృడంగా మార్చడానికి కోడిగుడ్డు అద్భుతంగా పనిచేస్తుంది. కోడిగుడ్డులో శరీరానికి కావలసిన అన్నిరకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి పిల్లల కండరాలను బలోపేతంగా చేయడంలో తోడ్పడతాయి. గుడ్డులోని పోషకాలు పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరిగేందుకు సహాయపడతాయి.

చేపలు: చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి. అంతే కాకుండా చేపల్లో ఉండే హై క్వాలిటీ ప్రోటీన్ బలహీనంగా ఉన్న పిల్లల కండరాలను బలోపేతం చేసి, వారు బరువు పెరిగేందుకు సహాయపడతాయి.

వీటితో పాటు మొలకలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలను ఆహారంలో చేరిస్తే ప్రోటీన్లు, పీచులు, ఇతర పోషకాలు అంది పిల్లల్లో నీరసం, బలహీనత తగ్గుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Read Also: వర్షాకాలంలోనూ సన్‌స్క్రీన్ వాడాలా? నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>