కలం, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లోని (Rajasthan) చురు జిల్లాలో కలకలం రేపిన ఓ ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక బ్యూటీ పార్లర్ యజమాని తన వద్ద పనిచేసే మహిళా ఉద్యోగులపై కన్నేశాడు. తాగే నీటిలో మత్తుమందు కలిపి, వారు స్పృహ కోల్పోయిన తర్వాత వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. యజమాని ప్రవర్తనపై అనుమానం వచ్చిన మహిళా ఉద్యోగులు పార్లర్లో రహస్య కెమెరాను ఏర్పాటు చేశారు. అతడు నీళ్లలో మత్తు బిళ్లలు కలుపుతున్న దృశ్యాలు ఆధారాలతో సహా రికార్డయ్యాయి. ఈ ఘాతుకాన్ని చూసి ఆగ్రహానికి గురైన సదరు మహిళలు, నిందితుడిని గదిలో బంధించి చెప్పులతో దేహశుద్ధి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు స్థానికంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
Read Also: వర్షాకాలంలోనూ సన్‌స్క్రీన్ వాడాలా? నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే
Read Also: డిజిటల్ వారసులు

