Mobile Popup Ad
Mobile Popup Ad

బస్‌స్టాప్‌లోకి దూసుకెళ్లిన బొలెరో.. ఇద్దరు మృతి

కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా శంషాబాద్‌లోని (Shamshabad) సత్తంరాయ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిర్చి లోడ్‌తో వెళ్తున్న ఓ బొలెరో (Bolero) వాహనం అదుపుతప్పి బస్‌స్టాప్‌లో వేచి ఉన్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. బొలెరో వాహనం కింద చిక్కుకుని సుమ, సువర్ణ అనే మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాహనం అదుపుతప్పడానికి గల కారణాలు, డ్రైవర్ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో సత్తంరాయ్ ప్రాంతంలో విషాదం నెలకొంది.

Read Also: ల్యాట్ రిలేషన్ షిప్స్ 

Read Also: వర్షాకాలంలోనూ సన్‌స్క్రీన్ వాడాలా? నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>