కలం డెస్క్ : భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయాలు(US Embassy), కాన్సులేట్ ఆఫీసులు (Consulates) బుధవారం నుంచి మూడు రోజుల పాటు బంద్ కానున్నాయి. క్రిస్మస్ సందర్భంగా సెలవులు ప్రకటిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై అధ్యక్షుడు ట్రంప్(Trump) సంతకం చేసినట్లు పేర్కొన్నది. డిసెంబరు 24-26 మధ్య రొటీన్‌గా జరిగే కాన్సులర్ సర్వీసులు, వీసా ప్రాసెసింగ్, సిటిజెన్ సర్వీసులు ఉండవని వెల్లడించింది.
కాన్సులేట్ లేదా ఎంబసీల(US Embassy) నుంచి అమెరికా పౌరులు ఏదేని అత్యవసర సేవలు పొందాలంటే వారికి సూచించిన ఎమర్జెన్సీ నెంబర్లను సంప్రదించాలని స్పష్టం చేసింది. రోజువారీ సర్వీసులు డిసెంబరు 29 నుంచి నార్మల్ కానున్నట్లు తెలిపింది. అమెరికాకు చెందిన అన్ని ఎగ్జిక్యూటివ్ డిపార్టుమెంట్లు, ఏజెన్సీలు కూడా క్లోజ్ అవుతాయన్నది. రక్షణకు సంబంధించిన వ్యవహారాలు యధాతథంగా ఉంటాయని, వాటికి సంబంధించిన సిబ్బంది విధుల్లోనే ఉంటారని తెలిపింది.
Read Also: ఆఫీసర్ల పనితీరుపై నేనే స్వయంగా సమీక్షిస్తా : సీఎం
Follow Us On: Youtube


