epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సర్పంచ్ సాబ్ ఐడియా అదుర్స్.. ఆడపిల్ల పుడితే రూ.5000 డిపాజిట్

కలం, వెబ్ డెస్క్: Sarpanch Innovative Idea | ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జగిత్యాల (Jagtial) జిల్లా పెగడపల్లి మండలం నర్సింహునిపేట సర్పంచ్‌గా సంధి రాజమణి  విజయం సాధించింది. బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే సంధి రాజమణి-మల్లారెడ్డి దంపతులు చక్కని ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఆడపిల్ల పుట్టిన ప్రతి కుటుంబానికి రూ.5000 డిపాజిట్ పథకం ప్రారంభిస్తామన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా చేరే ప్రతి విద్యార్థికి రూ.10,000 చొప్పున డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు.

Sarpanch Innovative Idea | ఆడపిల్లల సంక్షేమం, ప్రభుత్వ విద్యకు ప్రోత్సాహం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తుండటంతో సంధి రాజమణి-మల్లారెడ్డి దంపతులను గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఇటీవల బాధ్యతలు తీసుకున్న సర్పంచులు పల్లెల్లో పాలన కొనసాగిస్తున్నారు. గ్రామంలో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారమార్గం చూపుతున్నారు. కొందరు వ్యక్తిగత హామీలు (రోడ్లు, బస్సు సౌకర్యం) ఇస్తూ గ్రామస్తుల అభిమానం చూరగొంటున్నారు.

Read Also: నింగిలోకి దూసుకెళ్లిన‌ బ్లూ బ‌ర్డ్ బ్లాక్ 2 ఉప గ్ర‌హం!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>