కలం, వెబ్ డెస్క్: నేటి బిజీలైఫ్‌లో చాలామంది సమయానికి ఆహారం తీసుకోవడం లేదు. ఎప్పుడు తినాలి? ఎందుకు తినాలి? అనే విషయాలపై కనీస అవగాహన ఉండటం లేదు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. జీవనశైలి సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నారు. ముఖ్యంగా చాలామంది రాత్రి పూట భోజనం (Dinner) ఆలస్యంగా చేస్తున్నట్లు హెల్త్ సర్వేలు చెబుతున్నాయి. రాత్రి భోజనం ఆలస్యం చేయొద్దని ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్’ హెచ్చరించింది.
రాత్రి 8 గంటల తర్వాత తినడం వల్ల అధిక రక్తంలో చక్కెర, ఊబకాయం, గుండె (Heart) జబ్బులు లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ప్రతిరోజు ఆలస్యంగా తినడం వల్ల శరీర జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సహజ జీవ గడియారం దెబ్బతింటుంది. శరీర బరువు, హార్మోన్లు, గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర స్థాయిలు, నిద్ర విధానాలను కూడా ప్రభావితం చేస్తుంది. కాలక్రమేణా అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. రాత్రి ఆలస్యంగా తినడం(Dinner) సాధారణంగా అందరికీ హానికరమేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలు ఎదుగుదల దశలో ఉన్నందున వారికి తప్ప, మిగతా అందరికి ప్రమాదమేనని డాక్టర్లు (Doctors) చెబుతున్నారు.
కలిగే నష్టాలివే..
బరువు పెరగడం
డయాబెటిస్
గుండె జబ్బుల ప్రమాదం
రక్తపోటు పెరగడం
కాలేయంపై ఒత్తిడి
హార్మోన్ల అసమతుల్యత
వాపు
పోషక లోపం
Read Also: ఫైబర్ పుష్కలంగా ఉండే ఎనిమిది ఫ్రూట్స్
Follow Us On: Instagram


