కలం వెబ్ డెస్క్ : నేడు మేడారం(Medaram)లో సమ్మక్క(Sammakka), సారక్క(Sarakka) దర్శనాలను నిలిపివేశారు. మేడారంలో సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజుల గద్దెల నిర్మాణం జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు ప్రకటించారు. భక్తులు సహకరించాలని కోరారు. నేడు ఆదివాసీ ఆచార వ్యవహారాల ప్రకారం పలు పూజా కార్యక్రమాలు జరుపనున్నట్లు వెల్లడించారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు ఎవరూ దర్శనానికి రాకూడదని సూచించారు. అనంతరం భక్తులు యథావిధిగా దర్శనం చేసుకోవచ్చని చెప్పారు.
Read Also: ఆ టైమ్ తర్వాత భోజనం ఆలస్యంగా చేస్తున్నారా.. అయితే ఆరోగ్యం మటాష్!
Follow Us On: Pinterest


