Mobile Popup Ad
Mobile Popup Ad

బెంగళూరు నడిరోడ్డుపై తాచుపాము కలకలం.. వాహనదారులు పరార్

కలం, వెబ్ డెస్క్: రోజువారీ ట్రాఫిక్ జామ్‌లు, బిజీ లైఫ్‌స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బెంగళూరులో (Bengaluru) వింత సంఘటన చోటుచేసుకుంది. జూలై 7 సాయంత్రం ప్యాలెస్ రోడ్డులో ప్రయాణిస్తున్న వాహనదారులకు ఊహించని ఘటన ఎదురైంది. రద్దీగా ఉండే ఆ రోడ్డు మధ్యలోకి ఒక పెద్ద తాచుపాము వచ్చి చేరింది. దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు తన పడగ విప్పి రోడ్డుపైనే తిష్ట వేయడంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. ఆ విషసర్పం కదలకుండా అక్కడే ఉండిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. బెంగళూరు ట్రాఫిక్ రూల్స్‌తో సంబంధం లేదు అన్నట్లుగా ఆ పాము వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పాము వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఒక యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘బెంగళూరు ట్రాఫిక్‌కు కొత్త వీఐపీ అతిథి దొరికారు. ప్యాలెస్ రోడ్డులో తాచుపాము ప్రత్యక్షమైంది’ అని రాశారు. మరో నెటిజన్ స్పందిస్తూ ‘ఈ పాము సాయంత్రం వేళ ఒక 30 నిమిషాల ధ్యానం కోసం ఈ రోడ్డుపైకి వచ్చింది. ట్రాఫిక్ రూల్స్‌పై దానికి అసలు కేర్ లేదు’ అంటూ కామెంట్ చేశారు.

Read Also: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎన్ని గంటలు నిద్రపోవాలి?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>