Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్‌లో జగన్నాథ రథయాత్ర.. ఎప్పుడంటే?

కలం, నిజామాబాద్ బ్యూరో: ఇస్కాన్ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో జరిగే జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra)కు భక్తులు భారీగా తరలిరావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) పిలుపునిచ్చారు. ఇస్కాన్ కంటేశ్వర్ ఆధ్వర్యంలో బుధవారం ప‌లువురు ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 24న నగరంలోని కంటేశ్వ‌ర్‌ ఆలయం నుంచి రథయాత్ర ఉంటుందన్నారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించే రథయాత్రలో ఇందూరు భక్తులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఇస్కాన్ సేవలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని కొనియాడారు. నీల కంఠేశ్వరాలయం నుంచి ప్రారంభమయ్యే రథయాత్ర నగరంలోని ప్రధాన వీధుల గుండా తిరిగి కంటేశ్వర్‌లోని శ్రీరామ గార్డెన్‌కు చేరుకుంటుందన్నారు. ఇస్కాన్ కంటేశ్వర వ్యవస్థాపక అధ్యక్షుడు రామానంద రాయి గౌరదాస ప్రభు జి, నిత్య చాంద్ ప్రభు జీ, బలరాం ప్రభు జీ, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, బెల్లాల్ శశాంక్, సీనియర్ నాయకులు స్వామి యాదవ్, రఘుపతి గౌడ్, రోహిత్ ప్రభు జీ, సునీల్ ప్రభు జీ, భార్గవ్ ప్రభు జీ, తదితరులు పాల్గొన్నారు.

Read Also: నర్సింగ్ ఆఫీసర్లకు రాష్ట్రస్థాయి తొలి ఇండక్షన్ శిక్షణ ప్రారంభం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>