పిల్లలకు నూడుల్స్ పెడుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

కలం, వెబ్ డెస్క్: నేటి ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా మన ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్ పట్ల చాలా ఆసక్తి చూపిస్తారు. ఇంట్లో వండిన ఆహారం కంటే బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్, ముఖ్యంగా నూడుల్స్ (Noodles for Kids) తినేందుకు ఎక్కువ ఇష్టపడతారు.

పిల్లలు అడిగారు కదా అని తల్లిదండ్రులు కూడా వాటిని తరచుగా తినిపిస్తుంటారు. అయితే, నూడుల్స్ తరచుగా ఇవ్వడం వల్ల పిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో సోడియం, మైదా, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. శరీర ఎదుగుదలకు అవసరమైన పోషకాలు ఉండవు.

వారానికి ఎన్నిసార్లు పెట్టొచ్చు

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలకు నూడుల్స్ ను వారానికి 1 లేదా 2 సార్లు పెట్టొచ్చు. అంత కంటే ఎక్కువగా ఇవ్వడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందక తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఎక్కువగా పెడితే జరిగే నష్టాలు
  • పిల్లలకు నూడుల్స్ ఎక్కువగా తినిపించడం వలన వారి శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
  • నూడుల్స్ లో విటమిన్స్, మినరల్స్ ఏవి ఉండవు కాబట్టి పోషకాహారం లోపం ఏర్పడే ప్రమాదం ఉంది.
  • నూడుల్స్ లో ఉండే మైదా, కొవ్వుల కారణంగా పిల్లల్లో ఊబకాయం సమస్య తలెత్తుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే అధిక ఉప్పు కారణంగా చిన్న వయసులోనే పిల్లల బీపీ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
  • నూడుల్స్ లో పీచుపదార్థాలు ఉండవు కాబట్టి మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. సరైన పోషకాలు లేని జంక్ ఫుడ్ తరచుగా తినడం వల్ల చురుకుదనం తగ్గి, చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది.
  • పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి తరచూ జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది.

అయితే పిల్లలు ఖచ్చితంగా కావాలి అని మారాం చేసినప్పడు నూడుల్స్ ను ఆరోగ్యకరంగా మార్చి అప్పుడప్పుడు ఇవ్వాలట. దీనికోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి

  • ప్యాకెట్ తో పాటు వచ్చే మసాలాను పక్కనపెట్టి కూరగాయిలు జోడించాలి. క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, క్యాప్సికమ్, పాలకూరం, బీన్స్ వంటి కూరగాయలను ఉడికించి వేయాలి.
  • గుడ్డు, చికెన్ ముక్కలు, పనీర్ లేదా చీజ్ కలపడం వలన నూడుల్స్‌లో ప్రోటీన్ శాతం పెంచవచ్చు.
  • నూడుల్స్ తిన్న కొద్దిసేపటి తర్వాత పిల్లలకు తాజా పండ్లు లేదా పెరుగు ఇవ్వడం వలన జీర్ణక్రియకు మేలు జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

నూడుల్స్‌ను పూర్తిగా మానేసే అవసరం లేకుండా ఇలా ఆరోగ్యకరంగా మార్చి వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇవ్వచ్చని చెబుతున్నారు నిపుణులు.

Note: ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే అందించబడింది. దీనిని వైద్య సలహాగా భావించకూడదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>