epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ఫేషియల్​ రికగ్నేషన్​!

కలం, వెబ్​డెస్క్​: జాతీయ పోటీ పరీక్షల సంస్థ.. నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. నీట్​, జేఈఈ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో (National Entrance Exams) ఫేస్​ రికగ్నేషన్​ ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తద్వారా అక్రమాలకు అడ్డుకట్టకు వేసే వీలవుతుందని భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి అత్యాధునిక ఫేస్​ రికగ్నేషన్​ను ప్రవేశ పెట్టాలని ప్రణాళికలు తయారుచేస్తోంది. ఈ పద్ధతి అమలుకు తీసుకోవాల్సిన చర్యలను అధ్యయనం చేస్తోంది. పరీక్షలకు దరఖాస్తు చేసుకునే సమయంలోనే అభ్యర్థుల ముఖాలను గుర్తించేలా లైవ్​ ఫొటో క్యాప్చరింగ్​ ఆప్షన్​ తేవాలని భావిస్తోంది. వెబ్​క్యామ్​ లేదా మొబైల్​ ఫోన్​ ద్వారా ఈ ఫొటోలు తీసి, వెంటనే అప్​లోడ్​ చేయడం వల్ల ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాయకుండా అడ్డుకోవచ్చని ఎన్​టీఏ అధికారులు భావిస్తున్నారు. కాగా పరీక్షలుకు ఆధార్​ బేస్డ్​ ఫేస్​ అథెంటికేషన్​ను గతేడాది ఢిల్లీలోని కొన్ని నీట్​ పరీక్ష కేంద్రాల్లో పరిశీలించారు. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో వచ్చే ఏడాది నుంచి పేస్​ రికగ్నేషన్​ అన్ని పరీక్ష కేంద్రాల్లో అమలు చేయాలని అనుకుంటున్నారు. పేపర్​ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలపై అడ్డుకోవడానికి కేంద్రం నియమించిన రాధాకృష్ణన్​ కమిటీ సిఫార్సుల ఆధారంగా దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>