కలం, వెబ్ డెస్క్ : విజయవాడ (Vijayawada)లో వెలుగుచూసిన టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే విజయవాడలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నారు. వించిపేటలో ఉదయం 5 గంటల నుంచి ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. విజయవాడలో ఉగ్రవాద నెట్‌వర్క్ గురించిన వివరాలను మరింత తెలుసుకునేందుకు ఈ దాడులు జరుగుతున్నాయి.
ఇటీవల విజయవాడలో వెలుగుచూసిన టెర్రర్ లింక్స్ కేసులో ఉగ్రవాద సంస్థలు ISIS, AQIS లతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో మొత్తం 13 మందిని అధికారులు గుర్తించారు. అనుమానితులను సోషల్ మీడియా ద్వారా విదేశీ హ్యాండ్లర్లు ఉగ్రవాదం వైపు ఆకర్షించారని, నిధులు సమకూర్చారని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మొత్తం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కు తరలించారు. నిందితులు టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రామ్ లలో ప్రత్యేక గ్రూపులు సృష్టించి, విదేశీ హ్యాండ్లర్లతో కనెనక్ట్ అయ్యారని విచారణలో వెల్లడైంది.

