Mobile Popup Ad
Mobile Popup Ad

కిషన్ రెడ్డికి దమ్ముంటే కాళేశ్వరం విచారణ జరిపించాలి: మంత్రి లక్ష్మణ్

కలం, ధర్మారం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి (Kishan Reddy) దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై తీర్మానం చేసి సీబీఐ విచారణ కోసం కేంద్రానికి పంపిన అంశంపై విచారణ జరిపించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman) డిమాండ్ చేశారు. బంజారాల శీత్ల పండుగ సందర్భంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లంబాడి తండాలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి (Minister Adluri) మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంపై బీజేపీ నాయకులు అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కొరకు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటివరకు విచారణ ముందుకు సాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తేనే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి కాదని భావిస్తామని.. లేదంటే రెండు పార్టీలు ఒకటేనని ప్రజలకు వివరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని దుయ్యబట్టారు.

Read Also: ధరణి పోర్టల్‌లో భారీగా అక్రమాల గుర్తింపు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>