Mobile Popup Ad
Mobile Popup Ad

కార్మికుల హామీలు అమలు చేయండి: మొలుమూరి శ్రీనివాస్

కలం, కరీంనగర్ బ్యూరో: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సమయంలో ప్రధాన హామీలుగా ప్రస్తావించినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై తగిన చర్యలు తీసుకోలేదని బీజేపీ పెద్దపల్లి (Peddapalli) జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ (Molumuri Srinivas) విమర్శించారు.

సింగరేణిలో శాశ్వత ఉద్యోగులతో సమానంగా కష్టపడుతున్న వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటికీ తక్కువ వేతనాలు, పరిమిత సంక్షేమ సౌకర్యాలతోనే పనిచేయడం బాధాకరమని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియా సంస్థలలో అమలవుతున్న వేతనాల స్థాయిలో న్యాయమైన వేతనాలు అందించే దిశగా ప్రభుత్వం, యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే, సింగరేణి పరిధిలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులకు ఈఎస్ఐ (ESI) వైద్య సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించాలని, వారి కుటుంబాలకు నాణ్యమైన వైద్య భద్రత అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఎన్నికల సమయంలో కార్మికుల ఓట్ల కోసం హామీలు ఇవ్వడం, తర్వాత వాటిని విస్మరించడం సరికాదని పేర్కొంటూ, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియా ప్రమాణాలకు అనుగుణంగా న్యాయమైన వేతనాలు అమలు చేయాలి. సింగరేణిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు పూర్తి స్థాయి ఈఎస్ఐ వైద్య సౌకర్యాలు కల్పించాలి. కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం తక్షణ చర్యలు చేపట్టాలి. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని మొలుమూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల వెంకన్న, ఆరెపల్లి రాజన్న, పారంకుశ శ్రీనివాసచారి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు తీగల శ్రీధర్, గొంతుల సురేష్, మరుగు శ్రీకాంత్, సారయ్య అధిక సంఖ్యలో సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>