Mobile Popup Ad
Mobile Popup Ad

బండి భగీరథ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ.. తీర్పు రిజర్వ్‌

కలం, వెబ్ డెస్క్ : బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ (Bandi Bhageerath) పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భగీరథ్ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో విచారణ ముగిసింది. ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. విచారణ సందర్భంగా బాధితురాలి తరఫు న్యాయవాది బెయిల్‌కు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ దశలో బెయిల్‌ మంజూరు చేస్తే విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని, న్యాయ ప్రక్రియకు ఆటంకం కలగవచ్చని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు పోలీసులు కూడా బెయిల్‌ను వ్యతిరేకిస్తూ తమ వాదనలు వినిపించారు. బండి భగీరథ్‌ (Bandi Bhageerath) కు బెయిల్‌ మంజూరు చేస్తే కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, దర్యాప్తు, విచారణకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.

Read Also: డీఎస్పీ భీమ్ రెడ్డి అరెస్ట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>