కలం, వెబ్ డెస్క్: New Year Restrictions | న్యూఇయర్ కోసం మందుబాబులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఈవెంట్ నిర్వాహకులు, బార్లు, పబ్‌లు ఇందుకోసం సిద్ధమైపోయాయి. మాములూ రోజుల్లోనే మందుబాబులు రెచ్చిపోతుంటారు. ఇక న్యూ ఇయర్ వేడుకలంటే పట్టాపగ్గాలు ఉండవు.
అయితే డిసెంబర్ 31న అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకొనే అవకాశం ఉండటంతో పోలీసులు కొన్ని నిబంధలు విధించారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా రాత్రి 1 గంట వరకు బార్లు, క్లబ్బులు, ఈవెంట్లకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం డిసెంబర్ 31న తెలంగాణ వ్యాప్తంగా బార్లు, క్లబ్బులు, అనుమతులు పొందిన ఈవెంట్లు, పర్యాటక ప్రాంతాల్లో రాత్రి 1:00 గంటల వరకు మద్యం విక్రయానికి అనుమతి ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ నుంచి ముందస్తు అనుమతి పొందిన సంస్థలకు మాత్రమే ఈ సడలింపు(New Year Restrictions) వర్తించనున్నది. మిగిలిన దుకాణాల్లో అర్ధరాత్రి 12 గంటలకే మద్యం దుకాణాల మూసివేయాలి.
డిసెంబర్ 31న ఏ-4 మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12:00 గంటల వరకు మాత్రమే విక్రయాలు కొనసాగించాలి. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వబోమని పోలీసులు స్పష్టం చేశారు.
Read Also: వరల్డ్ కప్ ముందు స్టార్ ప్లేయర్‌కి సర్జరీ !
Follow Us On: Youtube


