కలం, భువనగిరి: దొరలు, రెడ్ల రాజకీయ సమాధి కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున సర్జికల్ స్ట్రైక్-59 ను ప్రారంభిస్తున్నామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) అన్నారు. భువనగిరి పట్టణంలో రాజ్యాధికార పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. 2028లో భువనగిరి నుంచి బీసీ బిడ్డ ఎమ్మెల్యే అవుతాడని దొరల, రెడ్ల భూములను పంచేందుకే రాజ్యాధికార పార్టీ లక్ష్యమన్నారు.
తెలంగాణలో 59 మంది దొరలు, రెడ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారని, మరో 884 రోజుల 5 గంటల 2 నిమిషాల 30 సెకండ్ల తర్వాత అసెంబ్లీ మొత్తం బీసీ ఎమ్మెల్యేలతో నిండి బీసీ ముఖ్యమంత్రి అవుతాడని అన్నారు. త్వరలోనే రెడ్ల పాలన అంతం కాబోతుందని, బీసీలకు రాజ్యాధికారం కావాలని అడిగిన బెల్లి లలితక్కను అగ్రవర్ణాల ప్రోద్బలంతో 17 ముక్కలుగా నరికారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయగిరి రైతులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.

