కలం, సినిమా : నందమూరి బాలయ్య నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. సినిమా పట్టాలెక్కడం లేదు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా అంటూ అనౌన్స్ చేశారు కానీ.. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆతర్వాత అఫిషియల్ గా ఎలాంటి అప్ డేట్ లేదు. ఇటీవల ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 సినిమా చేయబోతున్నారని.. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అలాగే ఈ సినిమాకి క్రిష్ డైరెక్టర్ అని కూడా టాక్ వచ్చింది. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. క్రిష్ తప్పుకున్నట్టుగా న్యూస్ వైరల్ అయ్యింది.
ఇప్పుడు ఓ కొత్త వార్త బయటకు వచ్చింది. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోలేదట. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో క్రిష్ బిజీగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ముందుగా ఈ సినిమాకి సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాలి అనుకున్నారు. అయితే.. బాలయ్య తనే డైరెక్ట్ చేస్తానన్నారు. అందుచేత సింగీతం తప్పుకున్నారు. ఆతర్వాత మనసు మార్చుకున్న బాలయ్య.. ఈ సినిమాని తెరకెక్కించే బాధ్యతను క్రిష్ చేతిలో పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇప్పటికే మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ బాగా లేట్ అయ్యింది. నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వెయ్య కళ్లతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బాలయ్యను అడిగిన ప్రతిసారీ మోక్షజ్ఞను ఎలా పరిచయం చేయాలో తెలుసు.. ఓ నాలుగైదు కథలు రెడీగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే.. 2026లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని గట్టిగా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇదే కనుక జరిగితే.. నందమూరి అభిమానులకు పండగే.
Read Also: జామపండును ఇలా తింటేనే అధిక లాభాలు..!
Follow Us On: Youtube


