కలం, వెబ్ డెస్క్ : ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చేబ్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఒక ఘోర రైలు ప్రమాదం (Eluru Train Accident)లో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చర్లపల్లి నుంచి షాలిమార్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు దాటుతున్న వారిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
మృతుల్లో ముగ్గురు మహిళలతో పాటు ఒక యువకుడు ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు ఛిద్రమై రైల్వే ట్రాక్‌పై పడిపోయాయి. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు ఎవరు, వారు ఎక్కడి నుంచి వచ్చారనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

