అకస్మాత్తుగా మనుషులపై రోబో దాడి.. క్లైమాక్స్‌లో ట్విస్ట్..!

కలం, వెబ్ డెస్క్ : టెక్నాలజీ ఉపయోగించి రోబోలను సృష్టించిన మానవుడికి వాటి నుంచి ప్రస్తుతం రక్షణ కరువయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల చైనా, జపాన్‌లలో రోబోలు దాడులు చేసిన ఘటనలు వెలుగు చూసిన వేళ తాజాగా ఇండోనేషియాలోనూ ఓ హ్యూమనాయిడ్ రోబో (Robot Attack ) అకస్మాత్తుగా మనుషులపై దాడి చేయడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

ఇండోనేషియాలో ప్రదర్శనకు ఉంచిన ఓ హ్యూమనాయిడ్ రోబో ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. చుట్టుపక్కల ఉన్న మనుషులను టార్గెట్ చేస్తూ ప్రొఫెషనల్ ఫైటర్‌లా గాల్లోకి లేస్తూ కిక్స్ ఇవ్వడం ప్రారంభించింది. ఈ దాడిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే దాడి తర్వాత కాస్త నెమ్మదించిన రోబో మార్షల్ ఆర్ట్స్ స్టార్ ‘బ్రూస్ లీ’ తరహాలో ఫైటింగ్ పోజ్ ఇచ్చి అలాగే నిలబడడం గమనార్హం.

రోబో దాడికి (Robot Attack) సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోబో ఏఐ ప్రోగ్రామింగ్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని టెక్ నిపుణులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఏది ఏమైనా రోబోల వల్ల భవిష్యత్ లో మానవళికి ముప్పు తప్పదని ఈ వీడియోను చూసిన పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: మెటాకు కేంద్రం బిగ్ షాక్… ఇన్‌స్టాలో ఆ కంటెంట్ పై నోటీసులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>