epaper
Friday, January 16, 2026
spot_img
epaper

శివాజీ కామెంట్స్​ పై మంచు మనోజ్​ ఫైర్​

కలం, వెబ్ డెస్క్​ : సీనియర్​ నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సులపై చేసిన వ్యాఖ్యలు (Shivaji Controversy) వివాదాస్పదమయ్యాయి. అయితే, ఆయన మాటలను కొందరు సమర్ధిస్తుంటే.. మరికొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. చిన్మయి (Chinmayi), అనసూయ.. శివాజీ వ్యాఖ్యలను తప్పు బట్టిన విషయం తెలిసిందే. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది వ్యక్తిగతమని, ఈ విషయం గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదన్నారు. అలాగే, మంచు మనోజ్​ (Manchu Manoj) కూడా శివాజీ వ్యాఖ్యలపై ఫైర్​ అయ్యారు.

ఈ మేరకు ఆయన సంచలన లేఖను విడుదల చేశారు. సమాజంపై ప్రభావం చూపే వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని అన్నారు. మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలు (Shivaji Controversy) ఆమోదయోగ్యం కాదని అసహనం వ్యక్తం చేశారు. గౌరవం అనేది వ్యక్తిగత ప్రవర్తనలో రావాలని.. మహిళల దుస్తుల గురించి మాట్లాడి, వారిని అవమానించడం ద్వారా కాదని వెల్లడించారు. మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన సీనియర్​ నటుల తరఫున క్షమాపణలు కోరుతున్నానని లేఖలో మంచు మనోజ్​ పేర్కొన్నారు.

Read Also: శివాజీపై తెలంగాణ మహిళా కమిషన్​ సీరియస్​

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>