కలం, వెబ్‌డెస్క్: ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చి తీరాల్సిందేనని జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) డిమాండ్ చేశారు. ట్రిపుల్‌ఆర్ వల్ల యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి జనం బాట(Jagruthi Janam Bata) కార్యక్రమంలో మంగళవారం భువనగిరి జిల్లాలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. యాదాద్రి జిల్లాలో నిర్మించిన ఎయిమ్స్(AIIMS) పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. గుత్తెదారు బిల్డింగ్స్ కట్టడంలో ఆలస్యం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కాంట్రాక్టర్ ఆలస్యం చేస్తున్నాడని ఆరోపించారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు నిలదీస్తూ ముందుకు వెళ్తున్నాం’ అంటూ కవిత పేర్కొన్నారు.
‘ఇప్పటికి 16 జిల్లాల్లో పర్యటించాం. ఆయా జిల్లాలో ఉన్న సమస్యలు చూస్తూ వచ్చాం. ప్రభుత్వాలను నిలదీస్తూ ముందుకు వెళ్లాం. అనేక సమస్యలు మా చొరవ వల్ల పరిష్కారం అయ్యాయి. అనేక సమస్యలు మా చొరవ వల్ల పరిష్కారం చూపిస్తూ ఉన్నాం. ఎయిమ్స్ 2016 సమయంలో యాదాద్రి జిల్లాకు వచ్చింది. కానీ ఇక్కడ పెద్దగా వసతులు లేవు. కనీసం ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా అందుబాటులో లేదు. ఇక్కడి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చింది’ అని కవిత పేర్కొన్నారు.


