కలం, వెబ్ డెస్క్: నగరంలో మరోసారి హైడ్రా (HYDRAA) కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. శనివారం సాయంత్రం హైడ్రా అధికారులు గచ్చిబౌలిలోని కొండాపూర్ (Kondapur) పరిధిలో పలు అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. బొటానికల్ గార్డెన్ నుంచి మసీద్ బండ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది, హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని గమనిస్తున్నారు.
రోడ్డు పక్కనే కూల్చివేతలు చేపడుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వీకెండ్‌తో పాటు ఆఫీసులు మూసివేసే సమయం కావడంతో వాహనాలు భారీ ఎత్తున ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారులపై అధికారులు ఈ సమయంలో కూల్చివేతలు చేపట్టడం ఏమిటని వాహనదారులు మండిపడుతున్నారు.

